అంబేద్కర్ త్యాగాలను కార్మికలోకం స్మరించుకోవాలి: బాదం వెంకటేష్

Published: Monday May 02, 2022
మంచిర్యాల బ్యూరో, మే 01, ప్రజాపాలన: కార్మిక బాంధవుడు, హక్కుల ప్రదాత అంబేద్కర్ అని ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ శ్రీరాంపూర్ బ్రాంచ్ సెక్రెటరీ బాదం వెంకటేష్ పేర్కొన్నారు. ఆదివారం ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి అనంతరం మాట్లాడారు. మనదేశంలో కార్మికులకు హక్కులు కల్పించింది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని, ఆయన లేకుంటే  ఈ దేశంలో కార్మిక చట్టాలు లేవన్నారు. ఆయన చేసిన కృషి  త్యాగాలను మేడే సందర్భంగా కార్మికలోకం గుర్తు చేసుకోవాలని ఆయన అన్నారు. పని గంటలు ఎనిమిదికి తగ్గింపు, లింగ భేదం లేకుండా సమాన పనికి సమాన వేతనం, వేతన చెల్లింపు చట్టం, భారత కర్మాగారాలు చట్టం, కార్మికుల పరిహార చట్టం, భారత కార్మిక సంఘాల చట్టం, కార్మికుల రక్షణ చట్టం, ప్రస్తుత ప్రయోజనాల చట్టం, కార్మికుల భీమా చట్టం, మహిళలు బాల కార్మికుల రక్షణ చట్టం, బొగ్గు గనుల కార్మికుల సంక్షేమ నిధి, వేతనంతో కూడిన సెలవులు, సామాజిక భద్రత, కార్మికుల కోసం ఏ పార్టీ పెట్టిన తొలి భారతీయ నాయకుడు ఆయనే అని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రెటరీ పెర్క సత్యనారాయణ, ఆర్ కె 5 ఫిట్ సెక్రెటరీ శ్రీ రాముల ప్రభాకర్, నాయకులు దాసరి సంపత్, శీలం చిన్నయ్య, అరుముళ్ల రాజు, కాదాసి రవీందర్, మోతె రవి తదితరులు పాల్గొన్నారు.