ప్రజావాణి విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించాలి

Published: Tuesday February 21, 2023
 వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి
వికారాబాద్ బ్యూరో 20 ఫిబ్రవరి ప్రజాపాలన : ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించవలసినదిగా    జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి  అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, జిల్లా రెవిన్యూ అధికారి అశోక్ కుమార్, జడ్పీ సిఇఓ జానకిరెడ్డి, డి ఆర్ డి ఓ కృష్ణన్, డీపీవో తరుణ్ కుమార్ లతో కలసి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణికి వచ్చే ఫిర్యాదీదారులతో మమేకమై వారి సమస్యలను సావధానంగా పరిశీలించి పరిష్కార దిశగా కృషి చేయాలని, నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. పరిష్కరించుటకు వీలులేని పక్షంలో తదుపరి చర్యల కోసం వారికి అర్ధమయ్యే విధంగా సూచనలు అందించాలన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదీదారుల నుండి 230  విజ్ఞప్తులను స్వీకరించారు.
అంతకుముందు జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ, పద్దతి ప్రకారంగా వీధులు నిర్వహించేందుకు విద్యా శాఖ తప్ప అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా ఈరోజు నుండి అటెండెన్స్ యాప్ డౌన్ లోడ్ చేసుకోనాలన్నారు.  మంగళవారం నుండి వంద శాంతం అటెండెన్స్ యాప్ ద్వారానే నమోదు చేయాలని సూచించారు.  వివిధ శాఖలలో ఏలాంటి ఫైల్స్ పెండింగ్ ఉండకూడదని, ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.