మ్యాంగో మార్కెట్ అభివృద్ధి పనులను పర్యవేక్షించిన మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీభాయి

Published: Wednesday February 17, 2021
జగిత్యాల, ఫిబ్రవరి 15 (ప్రజాపాలన): జగిత్యాలలోని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీభాయ్ స్థానిక ఎమ్మెల్యే డా. సంజయ కుమార్ తో కలిసి మ్యాంగో మార్కెట్ అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. అనంతరం అంతర్గామ్ గ్రామంలో అభ్యుదయ రైతులు పండించిన వివిధ రకాల పండ్ల తోటలను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో కలిసి లక్ష్మీభాయ్ వీక్షించారు.ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ లు దామోదర్ రావు రాజిరెడ్డి ఎంపీపీ గంగారాం గౌడ్ వైస్ ఛైర్మన్ లు మోసిన్ కొల్లూరి వేణు డైరెక్టర్లు బండారి విజయ్ కుమార్ మ్యాంగో ట్రేడర్స్ సభ్యులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.