బిఆర్ఎస్ పార్టీ ( కెసిఆర్ ) ద్వారానే అన్ని వర్గాల ప్రజల యొక్క అభివృద్ధి సాధ్యం బూర్గంపాడు మండ

Published: Wednesday October 19, 2022
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు మత్యకారులకు 100% రాయితీ పై ఉచిత చేప పిల్లల పంపిణీ  బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత మంగళవారం నాడు అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా  కామిరెడ్డి శ్రీలత మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో మత్యసంపద పెరిగిందని అందుకు అవసరమైన అన్ని సదుపాయాలను, రాయితీలను మత్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సీఎం కేసీఆర్ అందిస్తున్నారని తెలిపారు. మత్యకారుల కుటుంబాలు ఆర్థిక అభివృద్ధి చెందాలని సీఎం కేసీఆర్  ఆలోచనతో వారికి అవసరమైన అన్ని సదుపాయాలను సబ్సిడీపై ఇవ్వడం జరుగుతుందని అన్నారు., అన్ని వర్గాల ప్రజలను కులవృత్తుల ద్వారా ప్రోత్సహిస్తున్నారని, అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్  లక్ష్యమని ఆమె  అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కెసిఆర్  కులవృత్తుల మీద ఆధారపడి కుమ్మరి, చాకలి, గీత కార్మికులకు మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం వారి వృత్తులను ఉచితంగా పథకాల అందిస్తున్నారని తెలిపారు., గ్రామ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే సీఎం కేసీఆర్  లక్ష్యం  అని అందుకు అనుగుణంగా కొన్ని కోట్ల రూపాయలను కుల వృత్తుదారులకు కేటాయించారని ఆమె అన్నారు.
 ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ అధికారులు, మరియు గ్రామపంచాయతీ సెక్రటరీలు, పలువురు BRS పార్టీ నాయకులు, రైతులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
 
 
 
Attachments area