కేంద్ర సహకార బ్యాంక్ లీ. నగదు రహిత లావాదేవీలపై అవగాహన సదస్సు

Published: Saturday June 26, 2021
సారంగాపూర్, జూన్ 25 (ప్రజాపాలన ప్రతినిధి) : సారంగాపూర్ మండల కేంద్రంలోని జిల్లా వ్యవసాయ సహకార బ్యాంకు లీ. ఛైర్మన్ ఏలేటి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో చైర్మన్ బ్యాంక్ మేనేజర్ ఎండి మొయిజ్ ఫాష ఫీల్డ్ అఫిసర్ రాకెష్ మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బ్యాంక్ ఖాతాదారులకు తెలియజేస్తూ నగదు రహిత లావాదేవీలు తప్పకుండ అవసరమని బ్యాంకుల వద్ద ఖాతాదారులు క్యూ లైన్లో నిలబడి సమయాన్ని వృధా చేసుకోకుండ ఎటిఎం కార్డుతో మరియు ఫోన్ ఫే గూగుల్ ఫే నేట్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలు ఇంటివద్ద నుండి నిర్వహించుకోవచ్చని పేర్కొన్నారు. 18 నుండి 50 సంవత్సరాలు నిండిన ఖాతాదారులు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన పథకంలో సంవత్సరానికి 330 రూపాయలు చెల్లిస్తే సాధారణ మరణానికి 2 లక్షల భీమా వర్తిస్తుందని మరియు 18 నుండి 70 సంవత్సరాలు నిండిన ఖాతాదారులు ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజనలో సంవత్సరానికి 12 రూపాయలు చెల్లిస్తే ప్రమాద మరణం సంభవించన 2 లక్షల భీమా వర్తింస్తుందని అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచు గుర్రాల రాజేందర్ రెడ్డి సీఈవో ఇస్మాయిల్ డైరెక్టర్లు కొండ్ర రాంచందర్ రెడ్డి కాయితి శేఖర్ రెడ్డి ఏఈవో వేముల వెంకటేష్ సిబ్బంది భూమేష్ ఖాతాదారులు పాల్గొన్నారు.