సెప్టెంబర్ 1 ఉద్యోగుల జీవితాల్లో చీకటి రోజు

Published: Thursday September 02, 2021
టీఎస్ యుటిఎఫ్, యు.ఎస్ పిసి, జాక్టోబోనకల్ మండల శాఖలు
బోనకల్లు, సెప్టెంబర్ 01, ప్రజాపాలన ప్రతినిధి : 2004 సెప్టెంబర్ 1 ఉద్యోగుల జీవితాల్లో చీకటి రోజు అని టీఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్షులు కంభం రమేష్ టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు రామకృష్ణ అన్నారు. పెన్షన్ ని ద్రోహదినం నిరసన సందర్భంగా మధ్యాహ్న భోజన సమయంలో ఈరోజు బోనకల్ మండలం వ్యాప్తంగా పాఠశాలల ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసిస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2004లో ప్రవేశపెట్టిన సిపిఎస్ విధానం వలన ఉపాధ్యాయ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పెన్షన్ భద్రత లేకపోవడం వలన చనిపోయిన సిపియస్ ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరిని మార్చుకుని నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు బి శ్రీనివాసరావు, ఎస్ శ్రీనివాసరావు, పి పుల్లారావు, పి సుశీల, ఎం సి ఆర్ చంద్ర ప్రసాద్, బి ప్రీతం, పి గోపాల్ రావు, పి నరసింహారావు, డి రవి కిరణ్, పీ పుల్లా రావు, శ్రావణ్, రంజాన్ వలి, ఆర్ మురళి, ఎస్ రామకృష్ణ, చాంద్ పాషా, కే సౌభాగ్య లక్ష్మి, శ్రీనివాసరావు, బి.రాములు, రాఘవాచార్యులు, ప్రభాకర్  తదితరులు పాల్గొన్నారు.