మధిర కోర్టులో2277 కేసులు పరిష్కారం

Published: Monday June 27, 2022

మధిర జూన్ 26 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాల్టీ పరిధిలో ఆదివారం నాడుజరిగిన మెగా లోక్ అదాలత్ మరియు ముందస్తు లోక్ అదాలత్ లో భాగంగా  ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి కోర్టు లో 51 క్రిమినల్ కేసులు, 5 సివిల్ కేసులు ,1778 పెట్టి కేసులు పరిష్కారం కాగా మొత్తం 2,75,900 రూపాయలు జరిమానా విధించారు .అదేవిధంగా అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు పరిధిలో 81 క్రిమినల్ కేసులు పరిష్కారం కాగా, రెండు సివిల్ కేసులు, 363 పెట్టి కేసులు పరిష్కారం  2, 25, 650  జరిమానా కూడా విధించినారు .మొత్తం కేసులను మధిర కోర్టు జూనియర్ సివిల్ జడ్జి Sri D. ధీరజ్ కుమార్ గారి అధ్యక్షతన జరిగినటువంటి లోక్ అదాలత్ బెంచ్లో  పరిష్కారం చేయడమైనది. లోక్ అదాలత్ కు సహకరించిన న్యాయవాదులు , పోలీసులకు న్యాయమూర్తి అభినందనలు  తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులతో పాటు పి .పి నాగలక్ష్మి,  మధిర సర్కిల్ ఇన్స్పెక్టర్ ఓ. మురళి , ట్రైనీ ఐపీఎస్ సంకీర్త్, మధిర కోర్టు సూపరింటెండెంట్లు సత్యనారాయణ, వెంకన్న ,కోర్టు క్లర్కులు అనీషా, గోపాలకృష్ణ, ఉపేంద్ర, ప్రియ భావన,సరయు,  సబిత, షహీన్ సుల్తానా, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.