అంతిమ సంస్కారాల కోసం ఉచిత అంబులెన్స్ ఏర్పాటు

Published: Friday May 28, 2021
బెల్లంపల్లి, మే 27, ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి పట్టణంలో కరోనా మహమ్మారి తో మృతి చెందిన మృతులకు దహనసంస్కారాలు చేసేందుకు స్మశాన వాటిక వరకు తీసుకుపోయేందుకు ఉచిత అంబులెన్సు సౌకర్యాలను కల్పిస్తున్నామని మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేతా శ్రీధర్ తెలిపారు. గురువారం నాడు స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద అంబులెన్స్ సౌకర్యాన్ని ప్రారంబించిన అనంతరం మాట్లాడుతూ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదేశాల మేరకు బెల్లంపల్లి పట్టణంలో మృతి చెందిన మృతదేహాలను తరలించుటకు అంబులెన్సు సౌకర్యాన్ని ప్రారంభిస్తున్నామని ఉచిత అంబులెన్స్ సేవల కోసం చైర్ పర్సన్ సెల్ నంబర్ 7386689223, వైస్ చైర్మన్ 9440726213, అలాగే సానిటరీ ఇన్స్పెక్టర్ నెంబర్ 9100992164ను సంప్రదించాల్సిందిగా ఆమె తెలిపారు, పురపాలక సంఘం తరపున బెల్లంపల్లి పట్టణంలో కరోనా వైరస్ సోకి దురదృష్టవశాత్తూ మరణించిన వారి మృత దేహాలను స్మశాన వాటిక వరకు ఉచితంగా తరలించుటకై అంబులెన్స్ సేవలను ఈరోజు నుండి ప్రారంభిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిల్ & కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, తెరాస కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.