మండల కేంద్రంలో పర్యటించిన కలెక్టర్ వి పి గౌతమ్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ఆర్ఓబి కింద అ

Published: Wednesday September 07, 2022

బోనకల్, సెప్టెంబర్ 6 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని మంగళవారం కలెక్టర్ విపి గౌతమ్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పర్యటించారు. ముందుగా కలెక్టర్ కు, జడ్పీ చైర్మన్ కు సర్పంచ్ సైదా నాయక్ శాలువాతో సత్కరించారు. అనంతరం ఆర్వోబి సుందరీకరణ పనులను జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఆర్వోబి సుందరీకరణలో భాగంగా పూర్తి చేసిన గ్రీనరీ, బస్ షెల్టర్, పిల్లల పార్క్, పార్కింగ్ ఏర్పాట్లను వారు పరిశీలన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బస్ షెల్టర్ ఏర్పాటుకు పూర్వం రోడ్డుపై బస్సులు ఆపేవారని, ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు ఎంతో ఉండేవని అన్నారు. ఆర్వోబి కి చక్కటి పెయింటింగ్ లతో ప్రజలను ఆకర్షించే కళా చిత్రాలను సర్పంచ్ సైదా నాయక్ ఆధ్వర్యంలో చిత్రీకరించారు. గ్రీనరీ, పిల్లల పార్కుతో మంచి ఆహ్లాదకర వాతావరణం ఏర్పడిందని వారు అన్నారు. అదేవిధంగా రూ. 3 లక్షల వ్యయంతో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్ బ్లాక్ ను మండల ఎంపీపీ కంకణాల సౌభాగ్యం చేతుల మీదుగా వారు ప్రారంభోత్సవం చేశారు. సుందరీకరణ పనులతో ఈ ప్రాంతానికి, మండల కేంద్రానికి కొత్త అందం వచ్చినట్లు వారు తెలిపారు. ఆర్ఓబి ని ఇంతటి సుందరవనంగా తీర్చిదిద్దిన సర్పంచ్ సైదా నాయక్ కు కలెక్టర్ గౌతమ్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు అభినందించారు. ఈ కార్యక్రమంలో శిక్షణా అసిస్టెంట్ కలెక్టర్ రాధిక గుప్తా, బోనకల్ ఎంపిపి కంకణాల సౌభాగ్యం, ఎంపిడిఓ వేణుమాధవ్, తహసీల్దార్ రాధిక, టిఆర్ఎస్ మండల కార్యదర్శి మోదుగుల నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ యార్లగడ్డ రాఘవ, గ్రామపంచాయతీ కార్యదర్శి దామళ్ళ కిరణ్, ఆర్డబ్ల్యూసీ ఏఈ శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ ఏఈ నాగేశ్వరరావు, ఏ పీ ఓ బసవోజు కృష్ణకుమారి, ఆర్ ఐ లు లక్ష్మణ్, సత్యనారాయణ, మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.