కోవిడ్ వ్యాక్సిన్ పై ఇంటింటా అవగాహన

Published: Monday September 20, 2021
బెల్లంపల్లి సెప్టెంబర్ 19 ప్రజా పాలన ప్రతినిధి : బెల్లంపల్లి మున్సిపాలిటీ ఒకటో వార్డు పరిధిలోని ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని ఒకటవ వార్డు కౌన్సిలర్ సూరం సంగీత బానేష్ తెలిపారు. ఆదివారం నాడు వార్డు పరిధిలోని ఇళ్ళల్లో వైద్య సిబ్బంది తో పాటు ఇంటింటికి తిరుగుతూ వార్డు ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ పై అవగాహన కల్పిస్తూ వ్యాక్సిన్ తీసుకోవాలని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి, ల సూచనల మేరకు ఒకటవ వార్డు పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో 4 రోజుల క్రితం ప్రత్యేకంగా వ్యాక్సిన్ కేంద్రం ఏర్పాటు చేశారని అందరికీ అవగాహన కల్పిస్తూ ఇల్లిల్లూ తిరుగుతూ 18 సంవత్సరాలు నిండిన వారికి మొదటి డోసు వ్యాక్సిన్ వేయిస్తూ, మొదటి డోసు చేసుకున్నవారికి రెండవ డోస్ వేఇస్తూ ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకునే విధంగా అవగాహన కల్పిస్తూ వ్యాక్సిన్ వేయిస్తున్నామని ఈ నాలుగు రోజుల్లో 186 మందికి వ్యాక్సిన్ వేయించామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సూరం. సంగీత బాణేష్ మరియు వార్డు ప్రత్యేక అధికారి సి ఓ మల్లేపల్లి రామకృష్ణ,  అర్ పి రమ, అంగన్వాడి టీచర్ రాధాబాయి, ప్రభుత్వ వైద్య సిబ్బంది ఏఎన్ఎం చంద్రకళ, ఆశా వర్కర్ లలిత, తదితరులు పాల్గొన్నారు.