భాజాపా దేశంలో రైతులపై చేస్తున్న ద్రోహాలను చెప్పుకుంటూ పోతే భాజపా నాయకులకు గుడ్డలూడుతాయి

Published: Saturday September 24, 2022

భాజపా ఎన్ని రాష్ట్రాలలో

రైతులకు 24 గంటల కరెంటు ఇస్తుందో సమాధానం చెప్పాలి

 

-- మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డిచౌటుప్పల్, సెప్టెంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి): దేశంలో రైతులపై కసాయి తత్వం

చేస్తుంది మోడీ ప్రభుత్వం అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం చౌటుప్పల్ మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయం ఆవరణలో నూతన గోదాం నిర్మాణం కు చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం కు శంకుస్థాపన కార్యక్రమం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి చేతుల మీదగా ప్రారంభించారు. అనంతరం సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి అధ్యక్షతన సభ నిర్వహించగా ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి చైర్మన్ గంగిడి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు ఎన్ని ప్రభుత్వాలు ఏర్పడ్డా కూడా రైతులకు వ్యతిరేకంగా పనిచేశాయని. కెసిఆర్ మాత్రమే రైతులకు 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా పథకాలు, ఇచ్చి రైతు పక్షపాతి గా మారారని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఇనుకుని ఉన్న బిజెపి ప్రభుత్వాలు సైతం తెలంగాణలో కేసీఆర్ తీసుకొస్తున్న రైతు సంక్షేమ పథకాలను అభినందిస్తున్నారని మాట్లాడుతుండగా. భాజపా పెద్ద కొండూరు సింగిల్ విండో డైరెక్టర్ దూర్క కృష్ణ కలగజేసుకుని ఇది పార్టీ మీటింగు కాదని ఎన్నికల ప్రచార వేదిక కాదని ఆగ్రహించగా. మంత్రి జగదీశ్వర్ రెడ్డి కలుగజేసుకొని బిజెపి పరిపాలిస్తున్న రాష్ట్రాలలో రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్నారా అని దానికి సమాధానం చెప్పాలని లేకపోతే భాజాపా దేశంలో రైతులపై చేస్తున్న ద్రోహాలను చెప్పుకుంటూ పోతే భాజపా నాయకులకు గుడ్డలు ఊడుతాయని ఆగ్రహంతో ప్రశ్నించారు. ఈరోజు భారతదేశంలో రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి విద్యుత్ నల్ల చట్టాలను తీసుకొచ్చి బిజెపి ప్రభుత్వం రైతు నడ్డి విరుస్తుంటే. కేవలం తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ రైతులకు రైతుబంధు రైతు బీమా, 24 గంటల కరెంటు ఇచ్చి, సబ్సిడీ కింద రైతులకు పనిముట్లు ఇచ్చి, సకాలంలో ఎరువులు అందించడంతో తెలంగాణలో రైతులు ఆనంద పడుతున్నట్లు. భాజపా రాష్ట్రాల్లో ఆనందపడుతున్నారా దుఃఖిస్తున్నారా అని జవాబు చెప్పాలని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రానికి మోడీ అమిత్ షా ఎన్నోసార్లు వచ్చారని ఒక్క సారైనా తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చి వెళ్లిపోయారని సమాధానం చెప్పాలని. లేకుంటే గుడ్డలిప్పి కొడతానని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా ఉండి వృద్ధులకు 2000 పెన్షన్లు ఇచ్చిన ఘనత కేసిఆర్ కే దక్కిందని. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పథకాలు ఆడపిల్లల కన్న తల్లిదండ్రులకు ఊతం ఇవ్వగా. దళిత బంధు పథకంతో దళితుల కుటుంబాల కళ్ళల్లో ఆనందాన్ని నింపాయని అన్నారు. దేశంలో రైతులు ప్రజలు బాగుండాలని బిజెపి ఆలోచించడం మానేసి కులాలకు మతాలకు మధ్య చిచ్చులు రేకత్తడమే పనిగా పెట్టుకున్నారన్నారు. దేశంలో ప్రభుత్వ సంస్థలను అమ్మేసి భాజపా నాయకులు దేశ సంపదలను కొల్లగొడుతున్నారన్నారు. విద్యుత్ ను ప్రైవేటు చేయాలని విద్యుత్ చట్టాలను తీసుకొచ్చి. రానున్న రోజుల్లో పేద ప్రజలు దేశంలో కరెంటు బిల్లులు కట్టాలంటే ఇల్లును అమ్ముకోవాల్సిన పరిస్థితి బీజేపీ ప్రభుత్వం చేస్తుందని మండిపడ్డారు. మునుగోడులో భాజపా ప్రజాప్రతినిధులను కొంటుండొచ్చు కానీ మునుగోడు ప్రజలను కొనలేరని కెసిఆర్ అంటే ప్రజలకు ప్రేమ అభిమానం ఉన్నదని మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ జండా ఎగరడం ఖాయమన్నారు.

ఈ కార్యక్రమంలో డిసిసిబి వైస్ చైర్మన్

ఎసిరెడ్డి దయాకర్ రెడ్డి, నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ చీర్క సంజీవరెడ్డి, వైస్ చైర్మన్ కప్పల శ్రీనివాస్, సింగిల్ విండో వైస్ చైర్మన్ చెన్నగొని అంజయ్య, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నిరంజన్ గౌడ్, పట్టణ కమిటీ అధ్యక్షులు ముత్యాల ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు బాబా షరీఫ్, కొరగోని లింగస్వామి, సింగిల్ విండో డైరెక్టర్లు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.