ప్రత్యేక పనులకు ఆమోదం తెలిపిన బెల్లంపల్లి మున్సిపల్ కౌన్సిల్

Published: Thursday September 15, 2022
బెల్లంపల్లి సెప్టెంబర్ 14 ప్రజాపాలన ప్రతినిధి: బెల్లంపల్లి మున్సిపాలిటీ లో ప్రత్యేకంగా చేపట్టే వివిధ కార్యక్రమాలకు నిధుల మంజూరు,   కోసం మున్సిపల్  కౌన్సిల్ ప్రత్యేక సమావేశాన్ని బుధవారం ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు,  మున్సిపల్ కౌన్సిల్ ఆమోదంతో  దసరా, బతుకమ్మ పండుగల కోసం ప్రత్యేక   లైటింగ్ ఏర్పాటు చేయుటకు, చీకటిగా ఉన్న ఏరియాలలో  కొత్త విధ్యుత్ స్తంబాలు ఏర్పాటుకు విధ్యుత్ శాఖకు డబ్బులు చెల్లించుటకు, శానిటేషన్ విభాగంలో పాడైన వాహనాల రిపేర్ కోసం,  కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు ఆమె తెలిపారు.
     ఈ సమావేశం లో  చైర్ పర్సన్ శ్వేత ,కమీషనర్ ఆకుల వెంకటేష్ , వైస్ ఛైర్మెన్ బత్తుల సుదర్శన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు ,  మునిసిపల్ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు .