దళిత బంధు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల

Published: Saturday July 23, 2022

వికారాబాద్ బ్యూరో 22 జూలై ప్రజాపాలన : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు పరుస్తున్న దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు.

శుక్రవారం పరిగి నియోజకవర్గంలో దళితబంధు పథకం క్రింద ఎంపికైన లబ్దిదారులు ప్రభుత్వం అందించిన రూ. 10 లక్షల ఆర్థిక సహాయంతో వారు ఎంచుకున్న యూనిట్లకు జిల్లా కలెక్టర్ నిఖిల,పరిగి శాసన సభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి లు కలసి ప్రారంభోత్సవాలు చేసారు. సెంట్రింగ్ మెటీరియల్, మిల్లర్లు, డీజే మైక్ సౌండ్ సిస్టం షాపు, హోటల్ బిజినెస్ లు ఏర్పాటు చేసుకున్న దుకాణాలను ప్రారంభించారు. లబ్ధిదారులు మొగులయ్య లు, బంధయ్య, మాణిక్యం, లక్ష్మీలు ఈ పథకం క్రింద లబ్ది పొందారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ జానకి రెడ్డి, ఇ డి యస్ సి కార్పొరేషన్ బాబు మొజెస్, ఇండస్ట్రీస్ డి ఎం వినయికుమార్, ఎంపీడీఓ శర్మ, తహసీల్దార్ రాంబాబు, మున్సిపల్ కమీషనర్ ముకుంద అశోక్, ఎంపీపీ అరవింద్ రావు, జడ్పీటీసీ హరిప్రియ తదితరులు పాల్గొన్నారు.