విద్యార్థులను అన్ని రంగాలలో తీర్చిదిద్దే వేదిక "పాఠశాల” జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్

Published: Wednesday January 11, 2023
విద్యార్థులను అన్ని రంగాలలో తీర్చిదిద్దే వేదిక “పాఠశాల" అని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ట్రినిటి పాఠశాలలో ఏర్పాటు చేసిన వార్షిక క్రీడా ఉత్సవాలకు జిల్లా క్రీడా, యువజన శాఖ అధికారి శ్రీకాంత్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, పాఠశాల ప్రిన్సిపల్ జాన్ థామస్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులను అన్ని రంగాలలో తీర్చిదిద్దే వేదిక పాఠశాల అని, పాఠశాల స్థాయి నుండి జీవితంలో అన్ని రంగాలలో విజయం సాధించే దిశగా విద్యార్థులకు కృషి చేయాలని, ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించడంలో పట్టుదల, చిత్తశుద్ధితో ముందుకు సాగాలని తెలిపారు. ఆటలలో గెలుపు, ఓటములు సహజమని, క్రీడల మానసిక ఉల్లాసం, శారీరక ధారుఢ్యం కలుగుతుందని, విద్య రాణించడంలో ఎంతో దోహదపడతాయని తెలిపారు. అంతకు ముందు తెలంగాణ రాష్ట్ర జూనియర్ వాలీబాల్ కెప్టెన్, జాతీయ క్రీడాకారుడు, ట్రినిటి పాఠశాల పూర్వ విద్యార్థి అంకం అనుదీప్ న్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ బిజు కురివిల్లా, డైరెక్టర్ సుమనాజాన్, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు,
విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.