రైతులను మోసం చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం

Published: Wednesday March 16, 2022
బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్
మంచిర్యాల టౌన్, మార్చి15, ప్రజాపాలన : గడప గడపకు బిజెపి కార్యక్రమంలో భాగంగా రెండో రోజు బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ దండేపల్లి మండలం రంగపల్లి, రాసపల్లి, నంబాల గ్రామంలో బిజెపి ఇంటి ఇంటికి తిరుగుతూ రైతులను, ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్టు వలన పంట భూములు కోల్పోయిన రైతుల పంటలకు సాగు నీరు అందకపోవడంతో దండేపల్లి, హజిపుర్, లక్షట్టిపెట్ మండలనికి చెందిన రైతుల పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది అని అన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతుల పంటలకు సాగు నీరు అందించకుండా సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్, హైదరాబాద్ ప్రాంతాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నీరు తరలించి. ఇక్కడి రైతులను ఈ రాష్ట్ర ప్రభుత్వం ముంచుతుంది అని అన్నారు. పంట పొలాలకు కలువల ద్వారా నీరు అందకపోవడంతో రైతులు తమ స్వంత కర్చుతో మోటార్ల సాయంతో పంటలకు నీరు అందిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గత ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను మరచి టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందన్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గోపతి రాజయ్య, బందెల రవి గౌడ్, తోదేటి హారి కృష్ణ, బండే సత్యం, మొరుపుటాల సంజీవ్, మోటపలుకుల తిరుపతి, సిపిరిషేట్టి శ్రీనివాస్, మోటపలుకుల చింటూ, వళ్ళంబట్ల వంశీ, బియ్యాల సతీష్ రావు, సురేష్, కొట్టే సుధాకర్, ఆకుల శ్రీనివాస్, సాయి తేజ, బాలు, తదితరులు పాల్గొన్నారు.