ప్రచారాలు కాదు.. పనులు కావాలి

Published: Friday July 02, 2021

మధిర, జులై 01, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ మధిర రాష్ట్ర, జిల్లా స్థాయి నుండి అనేక అభివృద్ధి పనులనుసిసి రోడ్ల, డ్రైనేజ్, మరియు ఇతర నిర్మాణాలుమధిర మండల, మధిర మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఎన్నో తీసుకొచ్చి ప్రారంభోత్సవాలు చేస్తున్నారే కానీ వాటి నాణ్యత ప్రమాణాలను పరిశీలించటం లేదు. దానివల్ల కాంట్రాక్టర్ ఇష్టమొచ్చినట్లుగా మూడునాళ్ళ ముచ్చట అన్నట్లు నాసిరకం మెటీరియల్ తో నిర్మాణాలు చేస్తున్నారు. దీనిపై అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రత్యేకమైన దృష్టి సారించి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా నాణ్యమైన నిర్మాణాలు చేపట్టేందుకు కృషి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.