బత్తినేని చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో బీపీ షుగర్ క్యాంప్ విజయవంతం

Published: Monday September 05, 2022

బోనకల్, సెప్టెంబర్ 4 ప్రజా పాలన ప్రతినిధి: బీపీ షుగర్ పేషెంట్లు ప్రత్యేక మెగా క్యాంపును సద్వినియోగించుకోవాలని మేఘ శ్రీ హాస్పిటల్ జనరల్,, దంత, ఆర్థో వైద్యులు సతీష్ కుమార్, సోమనపల్లి ఉదయ్ కిరణ్, బుంగ శిరీష లు కోరారు. మండల కేంద్రంలో బత్తినేని చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో అమరజీవి , పేద ప్రజల ఆశాజ్యోతి, సిపిఐ సీనియర్ నాయకులు తూము ప్రకాష్ రావు జ్ఞాపకార్ధంగా నిర్వహించే బీపీ, షుగర్ ప్రత్యేక మెగా క్యాంపు బీపీ, షుగర్ పేషంట్లకు ఆదివారం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ప్రత్యేక క్యాంప్ లో రూ.100కే నెలకు సరిపడ బీపీ, షుగర్ మందులు అందజేస్తున్న బత్తినేని ఛారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమన్నారు. ఈ ప్రత్యేక క్యాంపు మండల ప్రజలకు ఎంతగానో ఉపయోగకరమన్నారు. బిపీ, షుగర్ వ్యాధు లతో బాధపడుతున్నవారు వైద్యకోసం ఖమ్మం, ఇతరత్ర పట్టణాలకు వెళ్లి వైద్యం చేయించుకోవాల్సిన అవసరం ఉండదన్నారు. వీరికి సమయంతో పాటు నెలకు రూ.1000 నుండి రూ.2000 వరకు ఖర్చు తప్పుతుందన్నారు. మండల ప్రజలు ఈ క్యాంప్ ను బీపీ షుగర్ పేషెంట్లు స్వదినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఏనుగు సుమన్ బాబు, పిఎసిఎస్ రిటైర్డ్ ఉద్యోగి మేదరమెట్ల నాగేశ్వరరావు, క్యాంప్ నిర్వహకులు ఆకెన పవన్, సాధనపల్లి ఆమర్నాధ్, సహాయకులు యంగల గిరి, రాయల క్రాంతి కుమార్ భవాని, సంధ్య తదితరులు పాల్గొన్నారు.