దేశ అభివృద్ధి లో యువత పాత్ర పోషించాలి

Published: Monday November 22, 2021

రాయికల్, 21 నవంబరు (ప్రజాపాలన ప్రతినిధి) : విద్యార్థుల శిక్షణ ముగింపు కార్యక్రమము సందర్భంగా రాయికల్ పట్టణంలోని జిఎంఆర్ వరలక్ష్మి పౌండేషన్ ఆధ్వర్యంలో చిన్న జీయర్ స్వామి ట్రస్ట్ భవనంలో ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, ఆటోమొబైల్, టైలరింగ్ కోర్సుల్లో శిక్షణ పొందిన యువతీ, యువకులు శిక్షణ ముగించుకుని శనివారం రోజున  ధ్రువపత్రాలు టూల్ కిట్స్ తో పాటు ఉద్యోగపత్రాలు కుడా అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాయికల్ మున్సిపల్ చైర్మన్ మోర హనుమాండ్లు మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా జి ఎమ్ ఆర్  వారు కల్పించిన ఉద్యోగం చేస్తూ దేశ అభివృద్ధి లో తమ వంతు పాత్ర పోషించాలని తెలిపారు. నిరుపేద మహిళలు ఐన రాజారావు లయ కు ఐ కేర్ ఫౌండేషన్ తరుపున నాగిరెడ్డి రఘుపతి రెడ్డి 3 వేల రూపాయలను, అదేవిదంగా సభా ముస్కాన్ కు హుస్సేన్ మరియు సోయేల్ 3 వేల రూపాయలను అందజేసి వారు కుట్టు మిషన్లు కొన్నుకోవడంలో తమ వంతు సహాయాన్ని అందించారు. మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్ గండ్ర రమాదేవి మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ అధ్యక్షులు గన్నే రాజిరెడ్డి, 3వ వార్డ్ కౌన్సెలర్ మారంపల్లి సాయి కుమార్ విద్యార్థులు అభివృద్ధి పధం లో ఉండాలని ఆశీస్సులు అందజేయడం జరిగింది.. ఈ కార్యక్రమాన్నీ జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రతినిధి ఎద్దండి ముత్యం రాజు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో జిఎంఆర్ సంస్థ ప్రిన్సిపల్ పి.రమేష్ కుమార్, శిక్షణా సిబ్బంది ప్రమోద్  శ్రీకాంత్, విజయలక్ష్మి, బెన్ హర్ డానియల్, చిరంజీవి యువతీ యువకులు పాల్గొన్నారు.