జెడ్పీ చైర్ పర్సన్ మరియు ఎంపీపీ లకు చెక్ పవర్

Published: Tuesday July 12, 2022

జగిత్యాల, జులై, 11 ( ప్రజాపాలన ప్రతినిధి): జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ చైర్ పర్సన్ మరియు ఎంపీపీ లకు చెక్ పవర్ వచ్చిన సందర్భంలో వారి వివరములు ఆన్లైన్ లో పొందుపరచిన తర్వాత వారికి డిజిటల్ టోకెన్స్ నీ  జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ అందజేసినారు.  అనంతరం జెడ్పీ చైర్ పర్సన్ మరియు ఎంపీపీ లు చెక్ పవర్ ఇచ్చినందుకు తెలంగాణ ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లాలోని శాసనసభ్యులకు ఎమ్మెల్సీలకు మరియు  ప్రత్యేక కృషి చేసిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లు  డిపిఓ హరి కిషన్, జెడ్పీ సీఈవో సుందర వరధరజన్, తదితులున్నారు.