బిఎస్పీ జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా సంపత్ కుమార్

Published: Wednesday September 22, 2021
జగిత్యాల, సెప్టెంబర్ 21 (ప్రజాపాలన ప్రతినిధి) : బహుజన సమాజ్ పార్టీ జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా బొల్లంపల్లి సంపత్ కుమార్ ను నియమిస్తూ పార్టీ జిల్లా కో ఆర్డినేటర్ న్యాయవాది పుప్పాల లింబాద్రి, జిల్లా అధ్యక్షులు చిర్ర శంకర్ లు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. బిఎస్పీ బలోపేతమే లక్ష్యంగా జిల్లాలోని అన్ని స్థాయిలో కార్యవర్గాల నియామకాలను చేపట్టాలని రాష్ట్రశాఖ ఆదేశాల మేరకు నియామకాలను చేపడుతున్నామని పేర్కొన్నారు. బీఎస్పీ బలోపేతానికి కృషి చేయాలని, గడప, గడపకు బిఎస్పీ లక్ష్యాలను చేరవేయాలని కోరారు. సంపత్ కుమార్ మాట్లాడతూ తన నియామకానికి కృషిచేసిన రాష్ట్ర, జిల్లా నాయకులకు బొల్లంపల్లి సంపత్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. పలువురు హర్షం వ్యక్తం చేశారు.