దోమల మందులు ఫాగింగ్

Published: Monday September 13, 2021

బోనకల్లు, సెప్టెంబర్ 12, ప్రజాపాలన ప్రతినిధి : బోనకల్ మండలం తూటికుంట్ల గ్రామంలో ఈరోజు సర్పంచ్ నోముల వెంకట నరసమ్మ ఆధ్వర్యంలో దోమల మందులు ఫాగింగ్ చేయించడం జరిగింది. అనంతరం సర్పంచ్ నోముల వెంకట నరసమ్మ మాట్లాడుతూ వర్షాకాలం సీజనల్ వ్యాధులు డెంగ్యూ మలేరియా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామంలో ఎవరి ఇళ్లలో వారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎక్కడ మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం లో గ్రామ ప్రజల బాధ్యత కూడా అవసరమని సర్పంచ్ అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నోముల వెంకట నరసమ్మ, పంచాయతీ సెక్రెటరీ తాళ్లూరు గోపి మరియు మల్టీపర్పస్ సిబ్బంది పాల్గొన్నారు.