అరెస్టు చేయడం అప్రజాస్వామికం జేఏసీ నాయకుల నిరసన

Published: Tuesday September 27, 2022
బెల్లంపల్లి సెప్టెంబర్ 26 ప్రజా పాలన ప్రతినిధి:  సమస్యల సాధన కోసం శాంతియుతంగా సమ్మె చేస్తున్న
కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు,  మద్దతు తెలుపుతున్న జేఏసీ నాయకులను స్థానిక వన్ టౌన్ పోలీసులు  అరెస్టు చేయడం అప్రజాస్వామిక చర్య అని హెచ్ఎంఎస్, ఐ ఎఫ్ టి యు నాయకులు తీవ్రంగా విమర్శించారు.
ఆదివారం నాడు స్థానిక పత్రికల వారితో మాట్లాడుతూ గత 19 రోజులుగా కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని చట్టబద్ధంగా నోటీసులు ఇచ్చి విజ్ఞప్తి చేసిన సమస్యలను పరిష్కరించకపోగా, చర్చల పేరుతో కాలయాపన చేస్తున్న కారణంగా జేఏసీ పిలుపు మేరకు ఆదివారం  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి సమయత్త మవుతా ఉంటే, ముందస్తుగా అరెస్టులు చేయడం   హేయమైన చర్య అని  నాయకులు అన్నారు.
 కార్మికుని ఆఖరి ఆయుధమైన సమ్మెను  చేస్తుంటే, పోలీసులు అప్రజాస్వామికంగా అరెస్టు చేయడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని, వారు తీవ్రంగా విమర్శించారు.
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్న, యాజమాన్యాలు ఆ ఆదేశాలను ఖాతరు చేయకుండా, కాంట్రాక్టు కార్మికులను బానిసలుగా చూస్తున్నారని, ఇప్పటికైనా కాంట్రాక్టు కార్మికుల సమస్యలను తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం, వెంటనే  పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని, లేనిచో సమ్మెను మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. 
 
ఈ కార్యక్రమం లో కోండ్ర శంకరయ్య, ఎండి గౌస్, తదితర కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.