చిట్యాల ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసిన ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు .

Published: Tuesday September 27, 2022

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ప్రజా పాలన..

.భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను పోరాడి స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన మన తెలంగాణ వీరవని చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు మాట్లాడుతూ

ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని హనుమాన్ టెంపుల్ వద్ద చాకలి ఐలమ్మ గారి 127 జయంతి సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు గారు మాట్లాడుత తెలంగాణ రాష్ట్రం కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ ప్రజలు ఎంతో ప్రేరణ కలిగించింది అన్నారు, నాడు తెలంగాణ ఉద్యమాన్ని రైతాంగ సాయుధ పోరాటంగా మార్చిన చాకలి ఐలమ్మ చేసిన పోరాటం చీర స్మరణీయమని అన్నారు, చాకలి ఐలమ్మ సాహసాన్ని నేటితర ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు, చాకలి ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ ప్రజలకు ఎంతో ప్రేరణ కలిగించిందని, తెలంగాణ ఉద్యమాన్ని రైతంగా పోరాటంగా మార్చిందఅని తెలియజేశారు, భూస్వామ్య వ్యవస్థను కూల్చి దౌర్జన్యాలను ధైర్యంగా ఎదిరించిన ఘనత ఆమెకే దక్కుతుందన్నారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చాకలి ఐలమ్మకు తగిన గుర్తింపు లభించింది అన్నారు*...