ఇబ్రహీంపట్నం ఆగష్టు తేదీ 2 ప్రజాపాలన ప్రతినిధి న్యాయవాది మల్లారెడ్డి హత్యకు నిరసనగా బార్ అ

Published: Wednesday August 03, 2022
ఇబ్రహీంపట్నం నియోజవర్గ కేంద్రంలోని ఇబ్రహీంపట్నం కోర్టు ఆవరణలో ములుగు జిల్లాకు చెందిన న్యాయవాది మల్లారెడ్డి హత్యకు నిరసనగా  మంగళవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  న్యాయవాదులందరూ  విధులు బహిష్కరించి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి న్యాయవాది తులువ   రవి కిరణ్ మాట్లాడుతూ  గతంలో కూడా అనేకమార్లు  పలువురు న్యాయవాదులపై దాడులు,హత్యలు జరిగాయని,అయినా కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం  దురదృష్టకరమన్నారు. సమాజంలో న్యాయాన్ని కాపాడే న్యాయవాదులకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.ములుగు జిల్లాకు చెందిన ప్రముఖ న్యాయవాది మల్లారెడ్డి దారుణ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని ,  వెంటనే దోషులను కఠినంగా శిక్షించాలనిన్నారు.ఇకనైనా అడ్వకేట్ల సంక్షేమం కోసం ప్రొటెక్షన్ యాక్టును ప్రభుత్వం ప్రత్యేక చొరవచూపి  వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.అనంతరం బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయవాది మల్లారెడ్డి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి,న్యాయవాది హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని  కోర్టు బయట నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు, న్యాయవాది మాదన్న బార్ అసోసియేషన్ న్యాయవాదులు   ఎల్ అంజన్ రెడ్డి,ఏ శ్రీశైలం,పి గణేష్,ఏ శ్రీనివాస్ కుమార్ సిహెచ్ రవి,డి జగన్,జి నర్సిరెడ్డి,ఎల్ అంబాచారి,ఎ బిక్షపతి,పి ధనంజయ్,జేపీ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.