విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశంమధిర రూరల్ సెప్టెంబర్ 1 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపా

Published: Friday September 02, 2022

అంతరాలపై ఖమ్మం సర్కిల్ సూపర్నెంట్ ఇంజనీర్ సురేంద్ర సన్నుత విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. చిలకల్లు 220 కె.వి నుండి మధిర 132కెవి సబ్ స్టేషన్ సరఫరా అయ్యే విద్యుత్తులో తరచూ అంతరాయాలు ఏర్పడుతుండడం, అంతరాయాలు తొలగించుటకు ఎక్కువ సమయభావం కలగటం, అదేవిధంగా మధిర ,ఎర్రుపాలెం, బోనకల్లు మండలాల్లో అంతర్గత విద్యుత్ సరఫరా లోపాలపై కూడా సమీక్ష నిర్వహించారు. తక్షణం అంతర్గత విద్యుత్ సరఫరా లోపాలపై చర్యలు తీసుకొని విద్యుత్ సరఫరాలో అంతరాలు తొలగించాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలోని పెద్ద గోపతి 220 కెవి సబ్ స్టేషన్ నుండి మధిర 132 కెవి సబ్ స్టేషన్ కు విద్యుత్ సరఫరా చేసే టవర్ల చివరి దశకు చేరుకున్న పనులను త్వరగా పూర్తిచేయాలని వీలైనంత త్వరలో మధిర 132 కెవి సబ్ స్టేషన్ కు ఆంధ్ర ప్రాంతంలోని చిల్లకల్లు నుండి కాకుండా పెద్దగోపతి నుండి పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని ట్రాన్స్కో ఎస్ ఈ గారిని కోరారు. మూడు నెలల కాల వ్యవధిలో పూర్తిస్థాయిలో చిరకాలంగా మధిర, ఎర్రుపాలెం, బోనకల్ మండలాల విద్యుత్ వినియోగదారులు కోరుకుంటున్నట్లుగా పెద్దగోపతి నుండి మధిర 132 కె.వి సబ్ స్టేషన్ కు జరుగుతున్న విద్యుత్ టవర్ల పనులు పూర్తి చేసి విద్యుత్ సరఫరా సమస్యలను అధిగమించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో వైరా డివిజన్ డి ఈ శ్రీ కృష్ణ , మధిర సబ్ డివిజన్ ఏ డి ఈ ఎం అనురాధ, ఖమ్మం సర్కిల్ టెక్నికల్ ఏ డి ఈ సిహెచ్ సుధాకర్ రావు మధిర పట్టణ, మధిర రూరల్, ఎరుపాలెం, మామునూరు ఏఈలు ఎస్ అనిల్ కుమార్, కే నాగేశ్వరరావు, వేణుగోపాల్, ఆర్ శ్రీనివాసరావు మరియు ట్రాన్స్కో ఏఈ పాల్గొన్నారు.