నవాబుపేట్ మండల యువజన కాంగ్రెస్ ఎఫెక్ట్...!

Published: Monday September 26, 2022
*చిట్టిగిద్ద రైల్వే స్టేషన్ మధ్య గల కల్వర్టు పనులు ప్రారంభం  
*నాణ్యతతో కూడిన బ్రిడ్జిని సకాలంలో నిర్మించాలని అధికారులకు విజ్ఞప్తి  
* మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గణపురం ప్రసాద్
వికారాబాద్ బ్యూరో 25 సెప్టెంబర్ ప్రజా పాలన : చిట్టిగిద్ద నుండి రైల్వే స్టేషన్ కు వెళ్ళే మార్గంలో కల్వర్టు శిథిలావస్థకు చేరిందని గత సంవత్సరం నుండి చాలా సార్లు నాయకులను ,అధికారులను యువజన కాంగ్రెస్ తరపున ప్రశ్నిచండం జరిగిందని గణపురం ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మార్గంలో ప్రతి రోజు హైదరాబాద్ కు ఉద్యోగ నిమిత్తం వెళ్ళేవారు చించల్ పేట్, అత్తాపూర్ ,అక్నాపూర్ గ్రామస్తులు మండలానికి వస్తుంటారు. అంతేకాకుండా పొలాలకు వెళ్ళే వాళ్ళు కూరగాయలు తీసుకుపోయే వాహనాలు ప్రతి రోజు ఈ బిడ్జ్ పైనుంచే వెళ్తుంటాయి. అధికారులు బ్రిడ్జి పనులు ప్రారంభించడం సంతోషంగా ఉంది. నాణ్యతతో కూడిన బ్రిడ్జి నిర్మించాలి అని అధికారులను, కాంట్రాక్టర్ కు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. నవాబుపేట్ మండల ప్రజలకు ఏ ఇబ్బంది కలిగిన యువజన కాంగ్రెస్ అండగా నిలబడుతుందని, మండల ప్రజల తరపున సమస్యలపైన ప్రతి విషయంలో నాయకులను అధికారులను ప్రశ్నించడం జరుగుతుందని భరోసా కల్పించారు. ఏదేమైనా యువజన కాంగ్రెస్ పోరాట ఫలితంగానే  బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం కావడం శుభపరిణామమని కొనియాడారు.