డ్వాక్రా మహిళలకు వ్యాక్సినేషన్ పరిశీలించిన మేయర్

Published: Friday June 18, 2021
బాలపూర్, జూన్ 17, ప్రజాపాలన ప్రతినిది : వ్యాక్సిన్ అందరికీ చేరేలా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, కానీ ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని కార్పొరేషన్ మేయర్ పేర్కొన్నారు. బడంగ్ పేట్  మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వయంసహాయక గ్రూపుల వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమాని గురువారం నాడు పలు కార్పొరేటర్ల తో కలిసి మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..... డ్వాక్రా మహిళలు ప్రతి గ్రూపు వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునిచ్చారు. జూన్ 21 నుండి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని, అయినప్పటికీ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, కరోనా మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కార్పొరేటర్లు  బిమిడీ స్వప్న జంగారెడ్డి, లిక్కి మమతా కృష్ణారెడ్డి, రాళ్ల గూడెం సంతోష శ్రీనివాస్ రెడ్డి, ముత్యాల లలితా కృష్ణ, కార్పొరేషన్ అధికారులు మేనేజర్ శ్రీధర్ రెడ్డి, ఆరో ఒ చంద్రశేఖర్ రెడ్డి, సురేష్, బాలాపూర్ ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.