విద్యార్థులకి వ్యాక్సిన్ వేసిన తరువాతనే పరీక్షలు నిర్వహించాలి : ఎస్ఎప్ఐ

Published: Thursday July 01, 2021

మంచిర్యాల జిల్లా ప్రతినిధి, జూన్30, ప్రజాపాలన : విద్యార్థులకి వ్యాక్సిన్ వేసిన తరువాతనే పరీక్షలు నిర్వహించాలని ఎస్ఎప్ఐ జిల్లా కార్యదర్శి సన్ని గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రం లోని సీపీఐ పార్టీ కార్యాలయంలో ఎస్ఎప్ఐ నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ, డిప్లమ, ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. కానీ ఇప్పటికీ కూడ విద్యార్థుల కి సిలబస్ పూర్తి కాలేదని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదని పేర్కొన్నారు. పరీక్షలు తప్పని సరిగా రాయాల్సిందే కానీ పరీక్షల కోసం ఎలాంటి ఆరోగ్య పరమైన చర్యలు తీసుకోకుండా పరీక్షలు పెట్టడం సరికాదని అన్నారు. ముందుగా పరీక్షలు రాసే విద్యార్థులకి వ్యాక్సిన్ వేసిన తరువాతనే పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ నాయకులు మొగిలి లక్ష్మణ్, దేవి పోచయ్య, ఎస్ఎప్ఐ పట్టణ నాయకులు నాయక్, తదితరులు పాల్గొన్నారు.