వరద ప్రవాహంలో మృతి చెందిన కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి, ఎమ్మెల్యేలు

Published: Wednesday September 01, 2021
వికారాబాద్ బ్యూరో 31ఆగస్ట్ ప్రజాపాలన : మర్పల్లి మండలం తిమ్మాపూర్ వాగు వరద ప్రవాహంలో ఆదివారం గల్లంతైన కారు ఘటనలో మృతి చెందిన నవ వధువు ప్రవళిక కుటుంబ సభ్యులను మోమిన్ పేట్ మండల కేంద్రంలో మంగళవారం పరామార్శించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ప్రవళిక తల్లిదండ్రులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మర్పల్లి మండలం రావుల పల్లి గ్రామంలో ప్రాణాలు కాపాడుకున్న నవాజ్ రెడ్డిని పరామార్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. నవాజ్ రెడ్డి సోదరి మృతి పట్ల తీవ్ర సంతాపం తెల్పారు. ఈ సంఘటనలో ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా, మరో బాలుడు శశాంక్ రెడ్డి ఆచూకీ తెలియక పోవటంతో వాగు పరివాహక ప్రాంతాల్లో ముమ్మరంగా గాలించాలని వికారాబాద్ ఎస్పీ కి ఆదేశించిన మంత్రి. వికారాబాద్ జిల్లా చేవెళ్ళ నియోజకవర్గము నవాబ్ పేట్ మండలం పుల్ మామిడి గ్రామ సమీపంలోని వాగు వద్ద మృతి చెందిన చాకలి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామార్శించారు.  భారీ వర్షానికి పుల్ మామిడి గ్రామంలో హనుమాన్ మందిరం సమీపంలో ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులో కొట్టుకొని పోయి మృతి చెందిన శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఎంపీ రంజిత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ లతో కలిసి పరామార్శించారు.