పొంగులేటి క్యాంప్ ఆఫీసులో కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Published: Wednesday March 24, 2021
ఉద్యోగుల కళ్ళల్లో ఆనందం నింపిన కెసిఆర్. తుంబుర దయాకర్ రెడ్డి..
 
ఖమ్మం (ప్రజాపాలన ప్రతినిధి) మార్చి 23 : ఖమ్మం జిల్లా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు 30 శాతం సిమెంట్ ప్రకటించడం పట్ల ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంగళవారం పాలాభిషేకం చేశారు క్యాంపు కార్యాలయ ఇంచార్జ్ తుంబుర దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ తూ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పిఆర్సి శాసనసభ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించిన ఉద్యోగుల కళ్ళల్లో ఆనందం అన్నారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులకు పిఆర్సి రూపంలో సీఎం కేసీఆర్ వరాలు కురిపించారన్నారు. దేశంలో ఎక్కడా లేనట్లుగా ఉద్యోగులకు రాయితీలను కెసిఆర్ ప్రకటించారన్నారు కరోనా క్లిష్ట సమయంలో ను ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చారు అన్నారు 30 శాతం ట్రీట్మెంట్ ను రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వర్తింప చేయడం సహో పవిత్రమైన నిర్ణయమన్నారు ఉద్యోగుల రిటైర్మెంట్ సమయంలోనూ 58 నుంచి 60 ఏళ్లకు పెంచటం సిపిఎస్ ఉద్యోగులకు కుటుంబాలకు పెన్షన్ సౌకర్యం కల్పించడం అభినందనీయమని అన్నారు కేజీబీవీ విద్యా సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు 180 రోజుల్లో వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ప్రకటించటం సంతోషకరమన్నారు.. అంతర్ జిల్లాల ఉద్యోగుల బదిలీలు ఏపీకి చెందిన ఉద్యోగులను పంపించడానికి అనుమతించటం గొప్ప నిర్ణయమన్నారు ఉద్యోగులకు ప్రమోషన్లు రిటైర్మెంట్ గాడ్ మీటింగ్ 12 లక్షల నుంచి 16 లక్షల వరకు పెంచి అందించ బోతున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలువురు టీఆర్ఎస్ నాయకులు. వడ్డెబోయిన శ్రీనివాస్, ఒంటి కొమ్ము శ్రీనివాస్ రెడ్డి, కొప్పెర ఉపేందర్, దొడ్డ నగేష్, తదితరులు  పాల్గొన్నారు