యువత అన్ని రంగాల్లో ముందుండాలి ** డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పోలీస్ మోడల్ టెస్ట్ ** డివైఎఫ్ఐ జిల్లా క

Published: Monday August 01, 2022
ఆసిఫాబాద్ జిల్లా జులై31(ప్రజాపాలన, ప్రతినిధి) : డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుల్ మోడల్ టెస్ట్ ను జిల్లా కేంద్రంలోని మాతృశ్రీ కళాశాలలో ఆదివారం  నిర్వహించారు. ఈ మోడల్ టెస్ట్ కు ముఖ్య అతిథులుగా స్థానిక ఎస్సైలు రమేష్, గంగన్న లు హాజరై టెస్ట్ ప్రశ్న పత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత అన్ని రంగాల్లో ముందుండాలని ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోటీ పడాలని, చెడు దారుల్లో వెళ్లకుండా మంచి దారిలో నడవాలని, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య నిర్వహిస్తున్న  మోడల్ టెస్ట్ ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఈ మోడల్ టెస్ట్ కు ఇతర ప్రజాసంఘాల నాయకులు  టీఎస్ యుటిఎఫ్, జిల్లా కార్యదర్శి ఇందూ రావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు అల్లూరి లోకేష్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ లు మాట్లాడుతూ దేశానికి యువత వెన్నుముక లాంటి వారిని, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఐక్యమత్యంతో  ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్ మాట్లాడుతూ డివైఎఫ్ఐ 1980లో ఏర్పడి యువజన సమస్యలపై పోరాటాలు చేస్తూ ఉద్యోగ ఉపాధి అందించాలని నిత్యం నిరుద్యోగ సమస్యపై పోరాటాలు నిర్వహిస్తూ పోటీ పరీక్షలు కూడా నిర్వహిస్తుందని అన్నారు. మోడల్ టెస్ట్ కేబీ జిల్లా కేంద్రంలో  149 మంది నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకున్నారని, భవిష్యత్తులో నిర్వహించే పోటీపరీక్షలకు అధిక సంఖ్యలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.