బాల వికాస మహిళ సభ ఆధ్వర్యంలో అనాధ పిల్లల పుట్టినరోజు వేడుకలు

Published: Wednesday March 17, 2021
మహబూబాబాద్ జిల్లా మార్చి16 ప్రజాపాలన ప్రతినిధి : బాలవికాస స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు అభినందనీయమని డోర్నకల్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు డీఎస్ రవిచంద్ర అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో అనాధ పిల్లల పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని పిల్లలచే కేక్ కట్ చేపించి ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు లేని పిల్లలను చేరదీసి వారి బాగోగులను చూస్తూ ప్రయోజకులను చేయుటకు చేస్తున్న సేవలు హేనలేలినివన్నారు.నా వంతుగా సహాయంగా రు.10000 పిల్లలకు సహయార్థం విరాళంగా ఇస్తున్నానాని నగదు అందజేశారు. ప్రోగ్రాం మేనేజర్ లతాప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ బాలవికాస సంస్థ దాతల సహాయంతో అనాధ పిల్లలను, వృద్ధులను చేరదీసి వారి బాగోగులను చూడటంతో పాటు 6500 గ్రామాల్లో త్రాగునీరు, విద్య, వైద్యం, పారిశుధ్యం, సేంద్రియ వ్యవసాయం, వితంతు వివక్షత నిర్మూలన కోసం అనేక కార్యక్రమాలను చేపట్టి గ్రామాల్లో మార్పు తీసుకరావటానికి కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వీరబోయిన కిషోర్, దయాకర్, పూర్ణాచారీ, సర్పంచులు సుష్మిత, శైలజ, సంస్థ ప్రతినిధులు తెరిస్సా, జ్యోతి, సుకన్య, శోభ, స్వర్ణలత, స్వరూప, యాకలక్ష్మి, వెంకటరత్నం, హిమాదేవి, ఉపేంద్ర, చాంద్ బీ, తదితరులు పాల్గొన్నారు.