పటోళ్ల ఇంద్రారెడ్డి జయంతి వేడుకలు

Published: Tuesday October 05, 2021
బాలాపూర్: అక్టోబర్ 4, ప్రజాపాలన ప్రతినిధి : స్వర్గీయ పటోళ్ల ఇంద్రారెడ్డి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలిచిన మహనీయులనే కార్పొరేషన్ మేయర్ పేర్కొన్నారు. బడంగ్ పేట్ కార్పొరేషన్ కార్యాలయంలో ముందు టిఆర్ఎస్ అధ్యక్షులు రామిడి రామ్ రెడ్డి ఆధ్వర్యంలో స్వర్గీయ పటోళ్ల ఇంద్రారెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి తో పాటు ప్రజా ప్రతినిధులు పాల్గొని ఇంద్రా రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ.... తెలంగాణ ప్రజల ఆకాంక్షను మొదటగా గుర్తించి మలి దశ ఉద్యమాన్ని ప్రారంభించడానికి స్పూర్తిగా నిలిచిన మహనీయులు అని అన్నారు. స్వర్గీయ ఇంద్రారెడ్డి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వారి అడుగుజాడల్లో నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానిక విద్యాశాఖ మంత్రి అమ్మ అని పిలిస్తే పలికే సబితమ్మ రాష్ట్ర ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నారని అన్నారు. టిఆర్ఎస్ అధ్యక్షులు రామిడి రామ్ రెడ్డి ఇంద్రా రెడ్డి జయంతి సందర్భంగా నిరుపేదలకు పండ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ చిగిరింత నర్సింహారెడ్డి, కార్పొరేటర్లు సుర్ణగంటి అర్జున్, పెద్దబావి శ్రీనివాస్ రెడ్డి, పెద్దబావి సుదర్శన్ రెడ్డి, సుక్క శివ కుమార్, భీమిడి స్వప్న జంగారెడ్డి, కో ఆప్షన్ సభ్యులు రఘునందన చారి, మర్రి జగన్మోహన్ రెడ్డి, ఖలీల్ పాషా, కార్పొరేషన్ టీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, నాయకులు బోయపల్లి శేఖర్ రెడ్డి, లిక్కి కృష్ణ రెడ్డి, రాళ్లగూడెం శ్రీనివాస్ రెడ్డి, పుట్టగళ్ల సంతోష్ కుమార్, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.