ఉప్పరి గూడ సహకార సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం

Published: Thursday September 30, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 29, ప్రజాపాలన ప్రతినిధి : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఉప్పరిగూడ ప్రాథమిక  వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ టేకుల సుదర్శన్ రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గ్రామం శేరిగూడ  సహకార పరపతి బ్యాంకు సింగిల్విండో కార్యాలయ ఆవరణలో బుధవారం సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఈఓ బోసుపల్లి గణేష్ మాట్లాడుతూ సమావేశంలో  మాట్లాడుతూ పరపతి సంఘం పాలకవర్గం మరియు రైతులకు సమక్షంలో ఆదాయ, వ్యయాలను చదివి వినిపించడం జరిగింది. అనంతరం సింగిల్విండో చైర్మన్ టేకుల సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఉప్పరిగూడ సొసైటీ ఆధ్వర్యంలో స్వల్పకాలిక పంట రుణాలు  బంగారంపై రుణాలు, మహిళా సంఘాలక,  రైతు మిత్ర గ్రూపు రుణాలు,  దీర్ఘకాలిక రుణాలు పౌల్ట్రీ, ట్రాక్టర్, గేదెలు, గొర్రెలు, పశువులు, పైప్లైన్, డ్రిప్ స్ప్రింక్లర్, ఎలక్ట్రిక్ మోటార్లు, పండ్లతోటలకు 2020 -21 కు గాను రుణాలు  అందజేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా రైతులకు రాయితీ విత్తనాలను సరఫరా చేశామని తెలిపారు. ఈ ప్రెస్ ద్వారా రైతులకు ఫెస్టిసైడ్స్ మరియు వ్యవసాయ సంబంధిత వస్తువులను అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహకార పరపతి సంఘం పాలకవర్గ సభ్యులు సింగిల్విండో చైర్మన్ టేకుల సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్మన్ క్యామ శంకర్, పాలకవర్గ సభ్యులు ఎదుళ్ల పాండురంగారెడ్డి, ఎదుళ్ల జంగారెడ్డి, కలరింగ్ విశాల, వర్త్య సీతయ్య, బొమ్మకంటి అశోక్, మేడిపల్లి పుల్లయ్య, సుబ్బూరి జంగయ్య, కంబాలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నల్లోళ్ల పోచమ్మ, గుర్రం సుధాకర్ రెడ్డి మరియు సంఘం పరిధిలోని పలు వ్యవసాయ రైతులు పాల్గొన్నారు.