నంబూరి మోహన్ రావు ఆధ్వర్యంలో అన్నదానం

Published: Thursday May 12, 2022
 నంబూరి మోహన్ రావు ఆధ్వర్యంలో అన్నదానం
 
తల్లాడ, మే 11  (ప్రజాపాలన న్యూస్):
 
 *శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలను బుధవారం తల్లాడలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పండితుల నడుమ మహిళా భక్తులు నగర సంకీర్తన, ప్రత్యేక కుంకుమ పూజ కార్యక్రమాలు చేశారు. స్వామివారిని పల్లకిలో ఉంచి పట్టణ పురవీధుల్లో నగర సంకీర్తన కార్యక్రమం చేపట్టారు. వాసవిమాతకు సంబంధించిన ఆధ్యాత్మిక గేయాలను విలపించారు. ఆర్యవైశ్య సంఘం తల్లాడ మండల అధ్యక్షులు నంబూరి మోహన్ రావు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం తల్లాడ మండల అధ్యక్షులు నంబూరి మోహన్ రావు, పట్టణ అధ్యక్షులు అనుమోలు సర్వేశ్వరరావు, కేతేపల్లి భాస్కర్ రావు, రామారావు, తదితరులు పాల్గొన్నారు.*