రీడ్ కార్యక్రమం పకడ్బందీగా అమలు చేయాలి

Published: Friday March 11, 2022

కోరుట్ల, మార్చ్ 10 (ప్రజాపాలన ప్రతినిధి): కోరుట్ల మండలంలోని మోహన్ రావుపేట గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రాథమికోన్నత స్థాయి స్కూల్ కాంప్లెక్స్ సమావేశం జరిగింది. కరోనా వల్ల లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో రెండు ఏళ్ళ తర్వాత మొదటి కాంప్లెక్స్ సమావేశం ప్రధానోపాధ్యాయురాలు కె.లలిత ఆధ్వర్యంలో జరిగినవి. ఈ సమావేశంలో సముదాయ పాఠశాలలో నిర్వహించబడుతున్న రీడ్రీడ్ (రీడ్ ఎంజాయ్ అండ్ డెవప్మెంట్) 100 రోజుల కార్యక్రమ అమలు తీరు, స్వచ్ఛ విద్యాలయ్, స్వచ్ఛ పాఠశాల, ఎక్ భారత్ శ్రేష్ట్ భారత్, బడి బయటి పిల్లల స్థితి, ఎఫ్ ఏ 1, యస్ ఏ 1 మార్కులు పాఠశాలల వారీగా సాధించిన ప్రగతి అంశాలపై రిసోర్స్ పర్సన్స్ అందే శివప్రసాద్, అశోక్, రాజ్ కుమార్, రమేష్, ప్రభాకర్ లు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సముదాయ పాఠశాలల ఉపాధ్యాయులు, సి.ఆర్.పి లు పి.గంగాధర్, దేవేందర్ లు పాల్గొన్నారు.