తాటిపర్తి కుర్మిద్ద సింగారం నంది వనపర్తి గ్రామాలకు చెందిన రక్షిత కౌలుదారులు తరతరాల నుండి

Published: Monday August 01, 2022

ఇబ్రహీంపట్నం జూలై 31 ప్రజాపాలన ప్రతినిధి.     *AIAWU*              *AIKS*
తాటిపర్తి గ్రామంలో  ఏర్పాటు  చేసిన రక్షిత   కౌలుదార్ల  మీటింగులో మాట్లాడుతున్న  అఖిలభారత రైతు సంఘం  ఉపాధ్యక్షులు  సారంపల్లి మల్లారెడ్డి గారు  మాట్లాడుతూ నంది వనపర్తి   ఓంకారేశ్వర దేవాలయంపెరు తో 1400 ఎకరాల  భూమి వుంది. కానీ
1952 భూ చట్టం రాకముందు నుండి రైతులు ఈ భూములు  దున్నుతున్నారు  1950 లో 37ఏ టేనెంటూ  సర్టిఫికెట్ రైతులకు ఇచ్చినారు. భూస్వాములు రైతులను మోసం చేసి   38ఈ సర్టిఫికెట్ రైతులకు రాకుండ  చేసి 1952 లో  దేవుని పెరు రాసి ఈ భూమి దేవునిదని  చెప్పుతున్నారు వాస్తవాలను పరిశీలిస్తే ఈ భూమి రైతులది కాబట్టి తరతరాల నుండి  ఇప్పటివరకు రైతులు ఈ భూమిని నమ్ముకొని సేద్యం చేస్తున్నారు. ఇందులో  భావులు  భోర్లు  త్రవ్వినారు  కరంటు మంజూరైంది  ఈ భూములను  రాళ్ళు రప్పలు తొలగించి అభివృద్ధి చేసి సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు కావల్సుకోని   రైతులను  భూమి నుంచి వెళ్లగొట్టడం కోసం  ప్రయత్నం జరుగుతుంది ఈ ప్రయత్నాలను విరామించుకొని   రైతులకే పట్టాలు ఇవ్వాలి రైతులకు మోసం చేసే చేస్తే రైతుల పక్షాన పెద్దఎత్తున ఉద్యమాలు పోరాటాలు చేస్తాము  . ఇదే భూమిలో  సర్వే నంబర్ 211 201 204 లో 380 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని  అధికారులు గుర్తించి నారు  దీన్ని ఫార్మాసిటీ కి ఇయ్యాలని   ప్రజా ప్రతినిధులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు  ఈ ప్రయత్నం మానుకుని సాగు చేస్తున్నా రైతులకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఈ కార్యక్రమం లో రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి మధుసూదన్ రెడ్డి  వ్యవసాయ కార్మిక సంఘం  జిల్లా కార్యదర్శి కె జగన్  సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఏ నర్సింహ వ్యవసాయ కార్మిక సంఘం  జిల్లా అధ్యక్షులు పి అంజయ్య   తాటిపర్తి  సర్పంచి  దూస రమేష్   జె రాములు ఉపసర్పంచ్ నర్సింహా  సంజీవ  డి. కృష్ణ  డి. బుగ్గారాములు రాములు రైతులు పాల్గొన్నారు.