ముస్లిం సోదరి సోదరులకు రంజాన్ కానుక

Published: Thursday May 06, 2021
మల్లాపూర్, ఏప్రిల్ 05 (ప్రజాపాలన ప్రతినిధి) : ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగల్లో రంజాన్ (ఈద్‌-ముబారక్) పండుగ ఒక్కటి. రంజాన్ పండుగ ఈ నెల 14వ తేదీన ఉండటం వలన ఈ పండుగను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ముస్లిం సోదరి సోదరులకు దుస్తులను పంపిణీ చేస్తుంది. ప్రభుత్వం పంపిణీ చేసే 400 వందల దుస్తులు మల్లాపూర్ మండలానికి రావడం జరిగింది. వచ్చిన వాటిని బుధవారం మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ కాటిపెల్లి సరోజన - ఆదిరెడ్డి, జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, యండి.అమినోద్దీన్, తహశీల్దార్ రవీందర్, ఎంపీడీఓ రాజ శ్రీనివాస్, గీర్దావర్ విశ్వనాథ్ రెడ్డి, చేతుల మీదుగా ముస్లిం సోదరి సోదరులకు అందజేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు పాటిస్తూ పండుగను జరుపుకోవాలని ప్రజాప్రతినిధులు మరియు అధికారులు సూచించారు.