కరోనా రోగులకు కాకతీయ కమ్మ సేవా సమితి చేయూత

Published: Saturday June 19, 2021
మధిర, జూన్ 18, ప్రజాపాలన ప్రతినిధి : మధిరలో ప్రతిరోజు కరోనా రోగులకు సుమారు 100 భోజనాలు అందజేత.కరోనా రోగులకు ఆపన్న హస్తం అందిస్తున్న కాకతీయ కమ్మ సంఘం.కాకతీయ కమ్మ సంఘానికి అభినందనలు తెలుపుతున్న మధిర ప్రజలు.అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు పెద్దలు ఇదే నినాదంతో గత నెల రోజుల నుండి మధిర పరిసర ప్రాంతాల్లో కరోన రోగులకు కాకతీయ కమ్మ సేవా సమితి ఆపన్న హస్తం అందిస్తూ ప్రతిరోజు భోజన సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. ఓ పక్కన ఒక్క రోగంతో బాధపడుతూ ఉన్న బాధితులకు వారి ఇంటి వద్దకు వెళ్లి రెండు పూటల భోజనం అందిస్తూ కరోన రోగుల పాలిట వరం లా కమ్మ సేవా సమితి పనిచేస్తుంది. మధిర పట్టణంలో  కాకతీయ కమ్మ సేవా సమితి సభ్యులైన గడ్డం శ్రీనివాసరావు మల్లాది వాసు చెరుకూరి నాగార్జున ఆధ్వర్యంలో అనేక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా కష్టకాలంలో ఉన్న బాధితులకు అండగా ఉంటూ ఇప్పటికే సుమారు నెల రోజుల నుండి రెండు పుట్ల పౌష్టికాహారంతో కూడిన భోజనాన్ని కరోన రోగులకు అందిస్తున్నారు. ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన కాకతీయ కమ్మ సేవా సంఘాన్ని మధిర మండల ప్రజలు తో పాటు కరోనా బాధితులు అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనే నినాదంతో వ్యయ ప్రయాసలకోర్చి సేవా కార్యక్రమాలు చేపట్టడం ఎంతో అభినందనీయం. కరోనా మహమ్మారి  విలయ తాండవం చేస్తూ ఎన్నో కుటుంబాలను కకావికలం చేస్తుంటే ఆదుకునే వారి కోసం ఎన్నో కుటుంబాలు ఎదురుచూస్తున్న సందర్భాల్లో మేమున్నామంటూ ముందుకొచ్చి కాకతీయ కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో మధిర పరిసర ప్రాంతాల్లో కరోన రోగులకు భోజన సౌకర్యాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం పట్ల ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా కాకతీయ కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని అనాధలకు, అభాగ్యులకు అండగా ఉండాలని మధిర ప్రాంత ప్రజలు కోరుతున్నారు.