లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

Published: Tuesday May 25, 2021
మధిర ప్రజా ప్రతినిధి : 23వ తేదీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రజలు సహకరించాలి మధిర టౌన్ ఎస్ఐ సతీష్ కుమార్. కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయాన్ని ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తప్పవని టౌన్ ఎస్ఐ సతీష్ కుమార్ పేర్కొన్నారు. ఉదయం 10 గంటల తర్వాత అనవసరంగా బయటకు వస్తే సంబంధిత వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని ఇప్పటికే అనేక సందర్భాల్లో చెప్పటం జరిగిందని, పట్టుకున్న వాహనాలకు ఎలాంటి రికమండేషన్ లు పనిచేయవని అత్యవసరమైతే తప్ప ఆకతాయిగా బయటకు రావద్దని లాక్డౌన్ నిబంధనలు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని ఎస్ఐ సతీష్ కుమార్ తెలిపారు. ఈరోజు మధిర పట్టణంలో సీఐ మురళి ఆదేశాల మేరకు ఉదయం 10 గంటల తర్వాత బయట తిరిగే వాహనాలను సీజ్ చేసి  కోర్టు కి పంపించనున్నట్లు తెలిపారు. లాక్ డౌన్ నిబంధనలు పటిష్టంగా అమలు కావాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరమని సూచించారు.