*బి సి జాగృతి పట్టణ అధ్యక్షుడు గా వైద్య భాస్కర్ నియామకం*

Published: Friday March 03, 2023

మంచిర్యాల టౌన్, మార్చి 02, ప్రజాపాలన:  తెలంగాణ బి సి జాగృతి ఆధ్వర్యంలో గురువారం బి సి జాగృతి కార్యాలయంలో జరిగిన సమావేశంలో  మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు గా వైద్య భాస్కర్ ను తెలంగాణ బి సి జాగృతి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్ నియమించారు. ఈ సందర్భంగా నూతనంగా భాద్యతలు తీసుకున్న వైద్య భాస్కర్ మాట్లాడుతూ నాపై పూర్తి విశ్వాసంతో నాకు ఈ బాధ్యతలు అప్పగించిన జిల్లా అధ్యక్షునికి కృతజ్ఞతలు  తెలియజేశారు, మంచిర్యాల పట్టణంలో బి సి జాగృతి ఆధ్వర్యం బి సి వాధులందరిని కలుపుకొని బి సి ల హక్కులకోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో బి సి జాగృతి నాయకులు మాజీ పట్టణ అధ్యక్షులు మడుపు రాం ప్రకాష్, ఉపాధ్యక్షులు మెంత్యల సంతోష్, కోశాధికారి సల్ల విజయ్ కుమార్, పట్టణ కార్యదర్శి వెన్నంపల్లి రవీందర్, జక్కుల రాజు, సంయుక్త కార్యదర్శి గుమ్ముల శ్రీనివాస్, యువ జాగృతి అద్యక్షులు మంచర్ల సదానందం,    వర్మని వెంకటేశ్వర్లు, వైద్య రవి, సాదుల సమ్మయ్య, వైద్య రవి, బి సి సీనియర్ నాయకులు పడల రామన్న, ఆకుల సంతోష్, పెద్దపల్లి సూరయ్య, పోతు సత్యనారాయణ,అట్లా సంతోష్ తదితరులు పాల్గొన్నారు.