వీఆర్ఏల పట్ల కెసిఆర్ మొండివైఖరి విడనాడాలి ** కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ **

Published: Friday August 26, 2022
ఆసిఫాబాద్ జిల్లా ఆగస్టు25 (ప్రజాపాలన, ప్రతినిధి) : వీఆర్ఏలు గత నెల రోజులుగా సమ్మె చేస్తున్న ముఖ్యమంత్రి మొండి వైఖరి విడనాడడం లేదని, ప్రభుత్వం తన మొండి వైఖరి విడనాడి డిమాండ్లు పరిష్కరించి సమ్మె విరమింప చేయాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం దినకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్లోని బాగ్ లింగంపల్లి సుందరయ్య పార్క్ వద్ద కెవిపిఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ నిరసనలో ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం దినకర్ పాల్గొని మాట్లాడుతూ సీఎం కేసీఆర్ 3 విడతలుగా వీఆర్ఏలకు ఇచ్చిన వాగ్దానం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.?, వీఆర్ఏ ల లో అత్యధికులు దళితులు పేదల గా ఉన్నారని, అందుకే సీఎం వివక్ష చూపుతున్నారని విమర్శించారు. తక్షణమే విఆర్ఏ, జేఏసీతో చర్చలు జరిపి సీఎం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. సమ్మెను ఎలాంటి భయం లేకుండా నిరాటంకంగా కొనసాగించాలని పిలుపునిచ్చారు.