మండల కేంద్రంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Published: Wednesday March 30, 2022
బోనకల్, మార్చి 29 ప్రజాపాలన ప్రతినిధి: మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు రావుట్ల సత్యనారాయణ అధ్యక్షతన పార్టీ శ్రేణులు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ 1982 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, బడుగు బలహీనవర్గాల సంక్షేమం కోసం స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీని స్థాపించారని, స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కిలో రెండు రూపాయల బియ్యం, జనతా వస్త్రాలు, రైతులకు ఉచిత కరెంటు, మహిళలకు ఆస్తి పై సమాన హక్కు, తాలూకా వ్యవస్థ ను రద్దుచేసి మండల వ్యవస్థ తీసుకురావడం లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చి ప్రజలకు సుపరిపాలన అందించారని, అన్ని కులాల వారికి రాజకీయ పరంగా సేవలు చేశారని అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాదును ఎంతో అభివృద్ధి చేశారని, తమ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రాబోయే రోజుల్లో మళ్లీ అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రావట్ల సత్యనారాయణ, సాధినేని హనుమంతరావు, నందమూరి సత్యనారాయణ, మైనేని రవికుమార్, బంధం రంగయ్య, మరీదు బరకయ్య, బండి రామారావు బానోతు శివల నాయక్, సండ్ర ప్రసాద్, బంధం అనిల్ కుమార్, చిత్రాల వెంకటేశ్వర్లు, పంది దాసు, మండెపూడి మోహనరావు, రావూరి మంగయ్య, తూటిపల్లి శ్రీనివాసరావు తూటిపల్లి వెంకట్రావు, కిలారు రమేష్, దుగ్గి భద్రయ్య, వట్టి కొండ నవీన్, తాటి బద్రి, చేబ్రోలు జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు.