బట్ల సందారం మట్టి రోడ్డుకు మరమ్మతులు

Published: Tuesday April 04, 2023
* కెఎస్అర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 3 ఏప్రిల్ ప్రజా పాలన :
గ్రామం నుండి పట్టణముకు రాకపోకలు కొనసాగించేందుకు రోడ్డు వ్యవస్థ సక్రమంగా ఉండాలని కె ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా దోమ మండలం బట్లసందారం గ్రామంలో గత  నెల 28 న వీధి నాటకానికి హాజరు కావడానికి వస్తున్న క్రమంలో రోడ్డు ను చూసి చలించి పోయారు.  గర్భిణీ స్త్రీలు, అత్యవసర కేసులు ఏమైనా ఉంటే గ్రామస్థుల పరిస్థితి ఏమిటని ఆలోచించారు. తక్షణమే వీధినాటకం వేదిక నుండి మాట్లాడుతూ మట్టి రోడ్డు మరమ్మత్తులకు రూ. 1,00,000 ప్రకటించారు. సోమవారం బట్ల సందారం గేటు నుండి ఊరి వరకు రెండు కిలోమీటర్ల మట్టిరొడ్డు మరమ్మతులు దగ్గరుండి వేయిస్తానని మాట ఇచ్చిన దాని ప్రకారం పనులు ప్రారంభించిన కెఎస్అర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా మీడియాతో  మాట్లాడుతూ మనం తెచ్చుకున్న తెలంగాణలో మనకు అభివృద్ధి జరిగింది ఏమి లేదని విమర్శించారు. నిరోధ్యోగులకు ఉద్యోగాలు లేవు? తెలంగాణలో అభివృద్ధి చెందింది మాత్రం  ఆంధ్ర పాలకులు, ప్రభుత్వ నాయకులు మాత్రమేనని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే పరిగి నియోజకవర్గం లో పర్యటించి పెద్ద గ్రామ పంచాయతీలుగా చిన్న చిన్న గ్రామ పంచాయితీలకు తమ సిడిఎఫ్ నిధుల ద్వారా నిధులు మంజూరు చేసి  అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ వార్ల రాములు మాట్లాడుతూ కెఎస్అర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి మా ఊరి గేటు నుండి ఊరి వరకు మట్టి రోడ్డు మరమ్మతులు చేయించడం సంతోషంగా ఉందన్నారు. పనులు అయిపోయేంత వరకు వారికి మేము పూర్తి స్థాయిలో సహకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వార్ల రాములు, బిజెపి సీనియర్ నాయకులు అజయ్ కుమార్ రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మల్లేష్ పటేల్, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు యాదయ్య, దోమ బీజేపీ అధ్యక్షులు శేరి రామ్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బొంగు మల్లేష్, తిరుమలేష్, కృష్ణ, కేశవులు, నర్సింహులు, మహేష్, యాదయ్య, నర్సింహులు, గ్రామస్థులు తదితరులు ఉన్నారు.