ఎంపికైన పాఠశాలలో పనులు పూర్తి చేయాలి

Published: Tuesday June 07, 2022
 వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 06 జూన్ ప్రజాపాలన :  మన ఊరు - మన బడిలో ఎంపికైన పాఠశాలల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా విద్యా శాఖ అధికారి, ఇ ఇ లు, డి ఇ లు, ఎ ఇ లు, మండల స్పెషల్ ఆఫీసర్ లతో మన ఊరు మన బడి పనుల పురోగతిపై జూమ్ సమావేశంలో సమీక్షించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, రూ.30 లక్షలకు పైబడి ఖర్చు గల పనులకు సంబంధించి వెంటనే టెండర్లు పిలవాలన్నారు.  రూ.30 లక్షలకు తక్కువ పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని ఆదేశించారు.  అలాగే ఎన్ఆర్ఇజిఎస్ నిధులతో చేపట్టే పనులైన ప్రహరీ గోడల నిర్మాణం, కిచెన్ షెడ్స్, మరుగుదొడ్ల పనులను చేపట్టి వెంటనే పూర్తి చేయాలన్నారు.  మండలానికి రెండు పాఠశాలల చొప్పున ఎంపిక చేసిన మోడల్ పాఠశాలలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.