ముంపుకు గురయ్యే భూములకు శాశ్వత పరిష్కారం. ... జిల్లా ఉద్యానవన, పట్టుపరిశ్రమ శాఖ అధికారి

Published: Wednesday July 20, 2022
మంచిర్యాల బ్యూరో, జూలై 19, ప్రజాపాలన : 
 
ముంపు గురయ్యే లోతట్టు ప్రాంతాల భూములలో పంట నష్టపోకుండా శాశ్వత పరిష్కారం కోసం ఆయిల్ పామ్ పంటను సాగు చేయవచ్చని జిల్లా ఉద్యానవన, పట్టుపరిశ్రమ శాఖ అధికారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8 నుండి 12వ తేదీ నుండి వరకు భారీ వర్షపాతం కారణంగా జిల్లాలోని గోదావరి, ప్రాణహిత నదుల పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల భూములలో వరద నీరు చేరి 3, 4 రోజుల పాటు ఉండటం కారణంగా ఆ ప్రాంతాలలో సాగు చేయబడే పత్తి, వరి, ఇతర పంటలకు నష్టం వాటిల్లిందని, ఇలాంటి తరుణంలో ఆయిల్ష్ఫామ్ పంటకు ఎలాంటి నష్టం వాటిల్లదని తెలిపారు. ప్రభుత్వం ద్వారా అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆయిల్షామ్ పంట సాగును 90 శాతం రాయితీపై మొక్కలు, 80, 90 శాతం రాయితీపై డ్రిప్ ఇరిగేషన్ పథకం ద్వారా లబ్ది పొందవచ్చని, పంట సాగు చేసిన 3వ సంవత్సరం నుండి 1 ఎకరాకు 1 లక్షల రూపాయల నిరక ఆదాయం పొందవచ్చని, ఈ పంట 35 నం॥ల వరకు ప్రతి నెల రెండు సార్లు కోతకు వస్తుందని, జిల్లాలోనే ఏర్పాటు చేయబోయే ఆయిల్షామ్ ఫ్యాక్టరీ వారు ఈ నెలలను కొనుగోలు చేసి నేరుగా రైతుల ఖాతాలలో డబ్బులు చేయడం జరుగుతుందని తెలిపారు. తగినంత భూమి, నీరు కలిగి ఉండి ఆర్థిక స్థోమత లేని రైతులకు బ్యాంక్ రుణం ఇప్పించడం జరుగుతుందని, ఈ పంటకు అడవిపందులు, కోతులు, దొంగల బెడద ఉందని తెలిపారు. ఆయిల్ష్పామ్ పంట సాగు దిశగా రైతులు ఆసక్తి చూపి నష్టాలు లేని పంట పొందాలని తెలిపారు.