విద్యాసంస్థల బిల్డింగ్ ఓనర్ లు అద్దె లో రాయితీ కల్పించాలి

Published: Thursday June 24, 2021

మంచిర్యాల టౌన్, జూన్ 23, ప్రజాపాలన : మంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు కు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాల జేఏసీ కరోనా విపత్తు వలన గత 16 నెలలుగా విద్యాసంస్థలు మూతపడడంతో వారికి రావలసిన ఫీజు బకాయిలు రాకపోవడం వలన అద్దె బిల్డింగుల లో ఉన్న ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు అద్దె చెల్లించలేని పరిస్థితిలో ఉన్నామని, విద్యాసంస్థల బిల్డింగ్ ఓనర్ లు మానవతా దృక్పథంతో కొంత రాయితీ ఇచ్చే విధంగా చొరవ తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు. తదనంతరం ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ ప్రపంచంలో కరోనా ధాటికి సర్వ నాశనం అయిన రంగం ఏదైనా ఉంది అంటే అది ఒక్క విద్యారంగమే అని మంచిర్యాల జిల్లాలో నూటికి 90% విద్యాసంస్థలు అద్దె భవనాలలోనే నడుపబడుతున్నాయని, కాబట్టి మన మంచిర్యాల జిల్లాలో అద్దె భవనాల్లో నడపబడుతున్న విద్యాసంస్థల బిల్డింగ్ యజమానులు కూడా ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని మానవతా దృక్పథంతో కరోనా కాలానికి సంబంధించిన అద్దెలలో రాయితీలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేజీ టు పీజీ విద్యాసంస్థల జేఏసీ జిల్లా కన్వీనర్ రాపోలు విష్ణు వర్ధన్ రావు, కో కన్వీనర్ ఉదారి చంద్రమోహన్ గౌడ్, జూనియర్, డిగ్రీ కళాశాల  సంఘం జిల్లా అధ్యక్షులు సాగర్ యాదవ్, రాష్ట్ర నాయకులు జి.నర్సయ్య, ఎస్.వి.రమణ, ఎన్.సంపత్, శ్రీనివాస రెడ్డి, ట్రస్మా నాయకులు కస్తూరి పద్మ చరణ్, కొమ్ము దుర్గాప్రసాద్, సి.హెచ్.విక్రమ్ రావు, బిజ్జు కురివిల్ల, మోహన్ వర్మ, శేఖర్, సాధిక్ పాష తదితరులు పాల్గొన్నారు.