దేశ భక్తిని పెంపొందించే సిరిమల్లెలు

Published: Monday May 02, 2022

మండల విద్యాధికారి - భత్తుల భూమయ్య

వెల్గటూర్, మే01(ప్రజాపాలన ప్రతినిధి): వెల్గటూర్ మండలం జగదేవుపేట ప్రాథమికోన్నత పాఠశాలలో పని చేసి బదిలీపై వెళ్ళిన కందుకూరి భాస్కర్ రాసిన సిరిమల్లెలు గేయాల సంపుటి విద్యార్థుల్లో దేశ భక్తిని, సామాజిక బాధ్యతను పెంపొందించేలా ఉందని  మండల విద్యాధికారి  బత్తుల భూమయ్య అభిప్రాయపడ్డారు. భాస్కర్ రాసిన గేయ సంపుటి ని  ఆవిష్కరించి ప్రతులను ఉపాధ్యాయులకు అందజేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ తెలుగు పండిట్ కందుకూరి భాస్కర్ రాసిన ఈ పుస్తకంలో పాఠశాలలో వివిధ సందర్భాలలో నిర్వహించుకునే ముఖ్యమైన దినోత్సవాల గురించిన పాటలున్నాయన్నారు. ఇవి విద్యార్థులు పాడుకోవడానికి సులభంగా, సరళమైన రీతిలో ఉన్నాయన్నారు. విద్యార్థులలో భాష నైపుణ్యాలను, సాహిత్యాభిలాష పెంపొందించేలా పుస్తక రచయిత భాస్కర్ చేసిన కృషిని కొనియాడారు. కందుకూరి భాస్కర్ మాట్లాడుతూ తన పుస్తక రచనకు మండల విద్యాధికారి  బత్తుల భూమయ్య  సహకరించారన్నారు. ఉపాధ్యాయులకు వారు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నీలం సంపత్, జోగం శ్రీనివాస్, నాగుల వేణు, కుమారస్వామి, లకుమల్ల సత్తయ్య, బండారి రాజు, మల్లయ్య ఐఆర్టిలు శ్రీనివాస్, శ్రీలత, సీఆర్పీలు రాజరాణి, వైద్య వెంకటేష్ లు పాల్గొన్నారు.