రామాజీపేట్ ఉన్నత పాఠశాల ఉత్తేజానికి దాతల విరాళం

Published: Saturday December 31, 2022

రాయికల్,డిసెంబర్ 30(ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండలంలోని రామాజీపేట్ గ్రామ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు సాయంత్రం ప్రత్యేక తరగతులలో అల్పాహారం అందించడంలో భాగంగా 'ఉత్తేజం ' కార్యక్రమానికి పూర్వ విద్యార్ధులు వేల్పుల సిద్థూ యాదవ్ ఉత్తేజానికి 3వేల రూ.లు,మ్యాకల రాజేష్ యాదవ్ 3వేలు రూ.లు,   మరియు ఆటవస్తులకు 2 వేల రూ.లను, కోల శ్రీనివాస్ పూర్వ విద్యార్థి ఎన్నారై 3 వేల రూ.లను  ప్రధానోపాధ్యాయులు తెనుగు రమేష్, హిందీ పండిట్ వేల్పుల స్వామి యాదవ్ లకు విరాళంగా అందజేశారు. గ్రామ సర్పంచ్ బెజ్జంకి రమాదేవి-మోహన్, యం‌.పి‌.టి.సి ఆకుల మహేష్, ఉప సర్పంచ్ జకిలేటి హరీష్ రావు, యస్.ఎం.సి చైర్మన్ కటుకం రమేష్, ఎనుగంటి లావణ్యలు దాతల ఔదార్యాన్ని, విరాళానికి సహకరించిన మాజీ సర్పంచ్ వాసరి రవి యాదవ్ లను అభినందించారు.  పాఠశాలకు దాతల కృషి ఎనలేనిదని, గ్రామ, పాఠశాల అభివృద్ధికి దాతలు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు తెనుగు రమేష్, పండిత పరిషత్తు జగిత్యాల జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి వేల్పుల స్వామి యాదవ్, వల్వోజు శ్రీనివాస చారీ, తంగళ్ళపెల్లి సతీష్, సి.హెచ్. విజయ్ కుమార్, బూసి రమ, చిటేటి ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.