సాగునీరు విడుదల చేయాలని రైతులు రాస్తారోకో ధర్నా

Published: Thursday April 01, 2021
బి.జె.పి కిసాన్ మోర్చా అధ్యక్షులు కోడి పల్లి గోపాల్ రెడ్డి, రావు హనుమంతరావు
వెల్గటూర్, మార్చి 31 (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గటూర్ మండలం కొత్తపేట గ్రామంలో రాష్ట్ర రహదారి పై ఎస్. ఆర్.ఎస్.పి  డి.83బి కాలువల ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరు అందక పొట్ట దశలో పొలాలు ఎండి పోతున్నట్లు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ కు రైతులు విన్నవించిన లాభం లేదని భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా కిసాన్మోర్చా అధ్యక్షులు కోడి పల్లి గోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బి.జె.పి కిసాన్ మెర్చా మండల శాఖ అధ్యక్షులు రావు హన్మంతరావు ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో బుధవారం రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగిత్యాల జిల్లా బి.జె.పి కిసాన్ మెర్చా అధ్యక్షులు కోడిపల్లి గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే కెసిఆర్ ఇక్కడి పంట పొలాలు నీరు అందించే ప్రభుత్వం మీదే అని ఎద్దేవా చేశారు. వెల్గటూర్ కిసాన్ మోర్చా అధ్యక్షులు రావు హనుమంతరావు మాట్లాడుతూ డి.83 బి కాలువ ద్వారా కొత్తపేట, పడకల్, కిషన్ రావు పేట, అంబారుపేట, శాఖాపూర్, కప్ప రావు పేట తదితర గ్రామాలకు వారబందీ సాగునీరు అందించే వారు గత వారం నుండి  సాగునీరు లేక వందల ఎకరాల పొలాలు ఎండి పోతున్నట్లు ఆయన తెలిపారు. వెంటనే నీటిని నిరంతరం సాగునీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోజిల్లా నాయకులు బండారి లక్ష్మన్, గొంటి ఆనంద్ ,బైకాని రవీందర్, ఈర్ల నవీన్ మరియు మండలనాయకులు శేఖర్,రాయిల్ల రాజు,గడ్డం మల్లారెడ్డి, చెలూరి మల్లయ్య, బుద్ధె పోశయ్య,జిట్టవేని రమేష్, దేవి రవీందర్, గొంటి కిరీటి, సమ్మెట బాపురాజు, ఎల్లల శ్రీధర్, వెంకటగిరి తిరుపతి, నాతరి మల్లేశం, దుర్గం రమేష్, దుర్గం రంజిత్, బెడ్డల మణి, బండారి రాజు,రైతులు ముచ్చర్ల మల్లేశం, బెడ్డల రాజయ్య, దేవేందర్ రావు, శ్రీనువాస్ రావు, వెంకట్ రావు, రాజేశం, వినోద్, శ్రీనువాస్, భీమయ్య ,రాజయ్య, సత్యనారాయణరావు, లచ్చయ్య, సత్తయ్య పోచయ్య తదితరులు పాల్గొన్నారు.